calender_icon.png 11 September, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం

11-09-2025 01:17:29 AM

తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ప్రపంచ ఆత్మహత్యల నివారణ  దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక హెలెన్ కిల్లర్స్ కళాశాలలో ఆత్మ నిర్భయ సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివి మెత్తుకూరి రామచంద్ర అసోసియేషన్ ప్రెసిడెంట్, లయన్ ప్రొఫెసర్ పఠాన్ ఉమర్ఖాన్, హెలెన్ కలర్స్ కళాశాల చైర్మన్, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, అసోసియేషన్ జాయిం ట్ సెక్రెటరీ రాజ్ ఆచార్య, సీనియర్ సైకాలజిస్ట్ నారాయణ, తులసి, కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ముగం, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

పఠాన్ ఉమర్ ఖాన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. క్షణికావేశంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చొద్దని సూచించారు. రాజా ఆచార్య మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లలకు స్ఫూర్తిగా ఉండాలని, గొడవపడి ఆత్మహత్యలు చేసుకుని పిల్లలను ఒంటరి చేయొద్దని సూచించారు.

డాక్టర్ మోతుకూరి రామచందర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఎలా బయటకు రావావలో వివరించారు. ఈ సందర్భాన్ని పునస్కరించుకొని డాక్టర్ మోతుకూరిని సంఘ సభ్యులు హెలెన్ కెల్లర్స్ పాఠశాల నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.