calender_icon.png 11 September, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు వల్లాలలో అమరుల స్థూపం ఆవిష్కరణ

11-09-2025 12:00:00 AM

-పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హన్మంతరావు వెల్లడి 

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : దేశ స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసి న పది మంది అమరుల జ్ఞాపకార్థ్ధం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామం లో  ఏర్పాటు చేసిన అమరుల స్థూపాన్ని శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ ఆవిష్కరిస్తారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హన్మంతరావు తెలిపారు. 

కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, సేవాదళ్, మహిళా, యుజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఇతర అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై అమరులకు నివాళులు అర్పించాలని ఆయన కోరారు.