calender_icon.png 27 October, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామన్ డైట్ మెనూను పాటించాలి

27-10-2025 12:25:16 AM

జిల్లా కలెక్టర్ హైమావతి 

సిద్దిపేట, అక్టోబర్ 26 (విజయక్రాంతి):సిద్దిపేట పట్టణ శివారున గల కెసిఆర్ నగర్ లోనీ మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదివారం ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు.

రికార్డుల నమోదును చెక్ చేశారు. కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాలతో రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. స్టోర్ రూమ్ లో కూరగాయలను, సరుకులను తనిఖీ చేస్తూ  వంట గది ఎల్లప్పుడూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఎప్పుడూ డ్రై గా ఉండే విధంగా చూసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.