27-10-2025 12:26:21 AM
సిద్దిపేట, అక్టోబర్ 26 (విజయక్రాంతి):లైసెన్సుడ్ సర్వేయర్ స్పెల్- 2 పరీక్షలు ఆదివారం ప్ర శాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్వేయర్లుగా శిక్షణను పొం దిన అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షా సెంటర్ ను జిల్లా కలెక్టర్ హైమావతి సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లైసెన్సెడ్ సర్వేయర్ స్పెల్- 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు తెలిపారు.
లైసెన్సుడ్ సర్వేయర్ల పరీక్ష ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు దశలుగా జరిగాయన్నారు. మొత్తం 153 మంది దరఖాస్తు చేసుకోగా 130 మంది హాజరయ్యారని 23 గైర్హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ వెంట ఏడి వినయ్ కుమార్, డిగ్రీ కళాశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.