12-07-2025 12:00:00 AM
నియమాలు పాటించని యజమానులకు నోటీసులు జారీ
భద్రాద్రి కొత్తగూడెం జులై 11 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని పాల్వంచ, సారపాక, భద్రాచలం ప్రాంతాల్లోనీ వివిధ ఆహార ఏజెన్సీస్ డీలర్లు, బేకరీ లలో శుక్రవారం జిల్లా డెసిగ్నేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ వాకా మధు వరుణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శరత్తులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రత నియమాలను, ప్రమాణాలను పాటించని యజమా నులకు నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోటల్లు ఆహా ర ఏజెన్సీలకు ఆహార డీలర్లకు బేకరీలకు సంబంధించిన అనుమతుల కోసం ప్రభుత్వ వ్బుసైట్ ద్వారా, సొంతగా, మీసేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మధ్యవర్తులను దళారులను నమ్మవ ద్దని, లైసెన్సు లేకుండా ఎవరైనా ఆహార వ్యా పారాలు మాంసాహార విక్రయదారులు బా ర్ అండ్ రెస్టారెంట్ షాపుల యజమానులు, మినరల్ వాటర్ ప్లాంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర సమాచారానికి జిల్లా వైద్య ఆరోగ్య శా ఖ కార్యాలయం లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.