12-07-2025 12:00:00 AM
అమ్మవారికి ప్రత్యేక పూజలు
సనత్‌నగర్, జూలై 11: ఈ నెల 13న జరగనున్న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను దృష్టిలో పెట్టుకుని శుక్రవరాం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఆయన సతీమణి దేవీవర్మ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి బోనం. పట్టు వస్త్రాలు సమర్పించా రు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇన్‌చా ర్జి మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి ఆలయానికి వచ్చి గవర్నర్ దంపతులను ఆత్మీయంగా ఆహ్వానిం చారు.
పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ కలెక్టర్ హరిచం దన కూడా ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు తదితర శాఖలతో కలిసి ఏర్పాట్లను సమీక్షిం చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మనోహర్‌రెడ్డి, డీసీ డాకు నాయక్ తదితరులు పాల్గొన్నారు.