calender_icon.png 13 July, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఆధ్వర్యంలో వైద్య శిబిరం

12-07-2025 12:00:00 AM

మణుగూరు, జూలై 11 ( విజయ క్రాంతి ) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంఓపెన్ కాస్ట్ ప్రభావిత గ్రామమైన పగిడేరులో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వ హించినట్లు, ఏరియా అధికార ప్రతినిధి శనగరపు రమేష్ తెలిపారు. సింగరేణి సిఎండి బలరాం ఆదేశాల మేరకు ఏరియా మెడికల్ సూపరిండెంట్ డా.సులోచన ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించినట్లు పేర్కొ న్నారు.

సింగరే ణి వైద్య సిబ్బంది గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మందు లను పంపిణీ చేశారు. వర్షాకాలం నేపథ్యం లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉం టుందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు వివరించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది రాము, కల్యాణ్, సేవ సమితి-కొ ఆర్డినేటర్ కేవి మారేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.