25-01-2025 12:00:00 AM
చలికాలంలో మొక్కలను బతికించుకోవడం అంత ఈజీ కాదు. మొక్కలకు సరైన వాతావరణం ఉంటేనే అవి సక్రమంగా పెరుగుతాయి. ముఖ్యంగా ప్లాంట్ లవర్స్ ఇండోర్ ప్లాంట్స్‌ను ఎలా బతికించుకోవాలి? మొక్కల సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం..
చలి నుంచి ఇండోర్ మొక్కలను కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సీజన్‌లో మొక్కలకు సరైన పోషణ అందక కళ కోల్పోతాయి. ఇంట్లో మొక్కలన్నీ ఎండిపోవడం, నిర్జీవంగా మారడం చాలాసార్లు చూసి ఉంటారు. చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గడమే దీనికి ప్రధాన కారణం.
చలికాలంలో ఇండోర్ ప్లాంట్స్ చాలా నిర్జీవంగా ఉంటాయి. ఈ ప్రభావితం మొక్కల పెరుగుదలపై పడుతుంది. కాబట్టి చలికాలంలో మొక్కలకు అవసరమైనప్పుడు మాత్రమే నీళ్లు పోయాలి.
నీరు పెట్టేముందు మట్టిలో తేమ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే రెండు నుంచి మూడు అంగుళాలు పొడిగా ఉంటే మొక్కకు నీరు పెట్టవచ్చు.
ఆరుబయట ఉంచిన మొక్కలు మంచుకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇండోర్ ప్లాంట్స్ బయట ఊహించిన ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటే మొక్కలు సరిగ్గా పెరుగుతుంది.
ఈ సీజన్‌లో ఇంటి గార్డెన్‌లో నాటిన మొక్కలకు కొన్ని యాంటీ కోల్డ్ కవర్స్‌తో కప్పాలి. ఇలా చేయడం వల్ల మొక్కల ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. పాలిథిన్, ఫాబ్రిక్ ప్లాంట్ కవర్, కార్డ్‌బోర్డ్ బాక్స్ లేదా ప్లాస్టిక్ బాక్స్‌తో కప్పవచ్చు.