calender_icon.png 30 January, 2026 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూదం ఆడుతున్న ఏడుగురు అరెస్ట్

30-01-2026 12:08:53 AM

రూ.46,852 నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం

మెదక్, జనవరి 29 (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట్ మండల పరిధిలోని మైసమ్మ గుడి వద్ద జూదం ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించి ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు టాస్క్ ఫోర్స్ సి ఐ తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో  మైసమ్మ గుడి సమీపంలో బొమ్మా బోరుసు (జూదం) ఆడుతున్న వ్యక్తులపై దాడి చేశామన్నారు. ఈ దాడిలో 7 గురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.46,852 నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అరెస్టయిన వారు బాసరం కృష్ణ, హట్కారి బాజీరావు, కాంచరీ సత్యం, కలల్లి సాయగౌడ్, పెద్దపర్వాణి సంగమేష్, అవులుదగిరి లింగం, అశేల్లి యాదగిరి గా పోలీసులు గుర్తించారు. వారిని శంకరంపేట్ (ఏ) పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.