calender_icon.png 30 January, 2026 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వేల అభివృద్ధికి సంస్కరణలు, నైపుణ్య వృద్ధికి కీలకం

30-01-2026 12:08:37 AM

దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ

సికింద్రాబాద్ జనవరి 29 (విజయ క్రాంతి): సికింద్రాబాద్‌లోని న్యూ బోయిగూడలో ఉన్న రైల్ కళారంగాల్లో దక్షిణ మధ్య రైల్వే 70వ రైల్వే వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరై, డివిజన్లు,పలు విభాగాలకు జోనల్ సామర్థ్య షీల్డ్‌లను, ఉత్తమ పనితీరుకు గాను 86 మంది అధికారులు, సిబ్బందికి వ్యక్తిగత విశిష్ట రైల్ సేవా పురస్కారాలు,35 ఎఫిషియెన్సీ షీల్డ్లను జోన్‌లోని వివిధ డివిజన్ డిపార్ట్‌మెంట్‌లకు అవార్డులను ప్రదానం చేశారు,

జనరల్ మేనేజర్ ఓవర్ ఆల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో హైదరాబాద్  గుంతకల్లు డివిజన్లు సంయుక్తంగా సాధించడంతో వారికి కూడా ఎఫిషియెన్సీ షీల్డ్‌లను ప్రదానం చేశారు. అనంతరం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ అవార్డు గ్రహీతలను అభి నందించి, 2024 సంవత్సరంలో వారు అందించిన అత్యుత్తమ సేవలను ప్రశంసించారు. సంస్థ యొక్క నిజమైన బలం ఉద్యో గులే అని పేర్కొంటూ, జోన్ తన సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.

జనరల్ మేనేజర్ జవాబుదారీతనం, కార్యాచరణతో కూడిన, రైలు వినియోగ దారుల సేవ, నిర్వహణ, ఉత్పత్తి మొదలైన అన్ని రంగాలలో కాలపరిమితితో కూడిన మార్పులతో వ్యవస్థాగత సంస్కరణలను తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆశిష్ మెహ్రోత్రా, డిప్యూ టీ జనరల్ మేనేజర్(జి) ఉదయనాథ్ కోట్లా వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు, డివిజనల్ రైల్వేమేనేజర్లు, ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.