27-12-2025 12:00:00 AM
గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల, డిసెంబర్ 26 : గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో శుక్రవారం గద్వాల నియోజకవర్గం లో వివిధ గ్రామపంచాయతీ లో సర్పంచులు గా గెలుపొందిన సర్పంచులకు ఉప సర్పంచ్ లకు వార్డు మెంబర్లు లకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు..నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, ఉప సర్పంచ్ లకు, వార్డ్ మెంబర్స్ మెమొంటో, శాలువా కప్పి, ప్రొసీడింగ్స్ పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.
గద్వాల నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీలు అభివృద్ధి కొరకు ఎస్ డి ఎఫ్ నిధుల ద్వారా 2 కోట్లు 51 రూపాయలు కేటాయించారు . ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా గ్రామపంచాయతీ సర్పంచ్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సర్పంచులకు ఉపసర్పంచ్ లకు వార్డ్ సభ్యులకు ప్రతి ఒక్కరికి న శుభాకాంక్షలు తెలుపుతున్నమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ పంచాయతీలు అభివృద్ధి కొరకు సీఎం ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని గ్రామాభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రతి ఒక్కరు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల మీపై నమ్మకం ఉంచి మిమ్మల్ని గ్రామ సర్పంచిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి స్పెషల్ డెవలప్మెంట్ ద్వారా ప్రత్యేక నిధుల ద్వారా రైతులు పొలాలకు వెళ్లి మట్టి రోడ్లను కేటాయించడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి మూడు లక్షలు నుంచి 5 లక్షల చొప్పున కేటాయించడం జరిగిందని తెలిపారు .
భవిష్యత్తులో గ్రామాలు అభివృద్ధి చెందడానికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఎమ్మెల్యేగా నేను ఉన్నాను సర్పంచ్ మీరు కలిసి గ్రామ అభివృద్ధి కోసం తోడ్పాటు పడాలి అప్పుడే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు.
గద్వాల నియోజకవర్గంలో ఆదర్శవంతంగా గ్రామాలుగా ఏర్పాటు అయి భవిష్యత్తులో రాష్ట్రస్థాయి జాతీయస్థాయి ఆదర్శ గ్రామాల్లో గద్వాల పేరు వచ్చే విధంగా ప్రతి ఒక్క సర్పంచ్ కృషి చేయాలని కోరారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలి గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.