calender_icon.png 27 December, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సాయం వైపు చూస్తున్న జాతీయ క్రీడాకారుడు

27-12-2025 12:00:00 AM

  1. కరాటేలో జనవరి 27న ముంబైలో తలపడేందుకు సిద్ధం 

పోలేపల్లి సెజ్లోని ఓ ఫార్మా కంపెనీలో తల్లిదండ్రుల కూలీ పని 

జాతీయస్థాయి పోటీకి ఆర్థిక సాయం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నా క్రీడాకారుడు బసని తేజవర్ధన్ 

జడ్చర్ల, డిసెంబర్ 26: ఎదగాలని గొప్ప సంకల్పం ఉంటే సరిపోదు... అందుకు తగ్గట్టు శ్రమించాలి ఆ లక్ష్యం వైపు అడుగులు వేయాలి కంకణ బద్ధులై పని చేయాలి అప్పుడే ఆ ఆ విజయం దరి చేరుతుంది. కొందరికి ఎంత పెట్టుబడి పెట్టిన అవసరమైన సదుపాయాలు అన్ని అందుబాటులో ఉంచినప్పటికీ ఆశించిన మేరకు  అవకాశాలను అంది పుచ్చు కోలేని పరిస్థితులు  ఉంటాయి.

ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ తల్లిదండ్రులు ఇద్దరు పోలేపల్లి సెజ్ లోని ఓ ఫార్మా కంపెనీలో కూలి పని చేస్తున్నప్పటికీ ఆ బిడ్డ కరాటే లో తనదైన శైలిలో రాణిస్తూ రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో జరగనున్న కరాటే పోటీలకు ఎంపికై ఒక్కసారిగా తన వైపు చూసేలా ప్రతిభ కనబరిచారు. కొత్త సంవత్సరం లో జనవరి 27 ముంబైలో జరిగిన జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. 

కూలిచేస్తేనే పూట గడుస్తుంది..

 బతుకుదెరువు ఊరు నుంచి బయటికి పంపింది. గండేడ్ మండలం రంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య, రేణుక దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఇద్దరు కూడా ప్రభుత్వ పాఠశాలలను విద్యాభ్యాసం చేస్తూ వస్తున్నారు. పొట్టకూటి కోసం కుటుంబం పోలేపల్లి గ్రామంలో నివాసం ఉంటూ ఆ కంపెనీలో కూలి పని చేస్తూ తమ కుమారుడిని కరాటే లో శిక్షణ ఇప్పిస్తూ విద్యాభ్యాసం చేస్తున్నారు. 

కుమారుడు తేజ వర్ధన్ పై ఉన్న మక్కువతో అండర్- 19 లో కరటెలు  రాష్ట్రస్థాయిలో ములుగు జిల్లాలో ఇటీవల నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక అయ్యారు. జాతీయస్థాయి ఎంపిక అయినప్పటికీ సంతోషంగా ఉన్న ఆ విద్యార్థి ఆర్థిక సహాయం చేస్తేనే ఆ క్రీడా పోటీలకు ఎంపిక అయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

కుటుంబ సభ్యులు సైతం ఎవరైనా ఆర్థిక సాయం చేస్తారు కదా ఆ నమ్మకంతో దాతల వైపు ఎదురుచూస్తున్నారు.వచ్చే నెల 27వ తేదీన దాతలు సహాయం చేస్తే ఆ క్రీడాకారుడు ముంబైలో జరిగిన ఉన్న అండర్ 19 జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని మన జిల్లాకు జడ్చర్ల నియోజకవర్గానికి మంచి పేరు తీసుకువచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాతలు చేయదలచిన వారు క్రీడాకారుడు తండ్రి కృష్ణయ్య 9177536075 నెంబర్ ను సంప్రదించాల్సి ఉంది.