17-09-2025 12:20:34 AM
సిద్దిపేట కలెక్టరేట్, సెప్టెంబర్ 16 : సిద్దిపేట జిల్లా విద్యాశాఖలో అవతవకలపై దర్యాప్తు చేయాలని బోనగిరి అశోక్ మాదిగ తెలిపారు. బెజ్జంకి మోడల్ స్కూల్ లో కులప్రాతిపాదికన ఎస్సీ జనరల్ కి కేటాయించిన ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాన్ని జిల్లా విద్యాధికారి తన రెడ్డి వర్గానికి కేటాయించారని ఆరోపించారు. ప్రస్తుతం బెజ్జంకి మోడల్ స్కూల్ లో విధులు నిర్వహిస్తున్న బయ్యారం కనక రెడ్డి ఆ వ్యక్తికి ఎలాంటి విద్యార్హతలు లేకపోగా అతని సర్టిఫికెట్లు కూడా ఫేక్ సర్టిఫికెట్లు అని అన్నారు.
జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి కులమైతే చాలు ఉద్యోగం ఉన్నట్లేనని వెల్లడించారు. ఈ విషయమై పలుమార్లు జిల్లా విద్యాధికారికి తెలుపుతూ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని కోరిన విద్యాధికారి పెడచెవిన పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా అతడు పని చేస్తున్న పాఠశాల ద్వారానే అతని సర్టిఫికెట్లు కోరగా అందులో ఇంటర్ విద్యార్హతలు కూడా లేవని ఉన్న డిగ్రీ కూడా ఆంధ్ర యూనివర్సిటీకి చెందినదని,
బిపిఎడ్ కూడా మహారాష్ట్రకు చెందిన స్వామి రామానంద తీర్థ మరాట్వాడా యూనివర్సిటీకి సంబంధించిన ఎలాంటి స్టాంపులు కూడా లేని, కనీసం సర్టిఫికెట్ నెంబర్ కానీ అకాడమిక్ ఇయర్ కానీ లేని సర్టిఫికెట్లు విద్యాశాఖ వారే అందించారని తెలిపారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయగా దొంగలకే తాళాలు ఇచ్చినట్లు కలెక్టర్ కూడా జిల్లా అధికారికే బదిలీ చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే ఇకనైనా అధికారులు మేలుకొని నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్న బయ్యారం కనక రెడ్డి సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్ చేసి అర్హత కలవారికే ఈ ఉద్యోగం కేటాయించాలని తెలిపారు.
గతంలో ఇతడిని తొలగిస్తున్నామని తెలుపుతూ భోనగిరి అశోక్ కి ఈ ఉద్యోగం కేటాయిస్తున్నామని ఇచ్చిన మరొక ప్రొసీడింగ్ ఆర్ సి నెంబర్ 1606/ బి1/ టిఎస్ ఎం ఎస్/ 2018 పై కూడా జిల్లా విద్యాధికారి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ విషయం తీసుకుపోయి, కోర్టుకు వ్ళ్ళునా సరే న్యాయపోరాటం చేస్తానని భోనగిరి అశోక్ తెలిపారు.