15-08-2025 01:50:56 AM
11 మందికి ప్రశంసనీయ సేవా పతకాలు
ప్రకటించిన కేంద్ర హోంశాఖ
హైదరాబాద్, ఆగస్టు 14: మన రాష్ట్రానికి చెందిన కానిస్టేబుల్ రాజు నాయక్ అత్యున్నతమైన రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కేంద్ర హోంశాఖ పోలీసు బలగాలకు పతకాలు ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 1,090 మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో తెలంగాణకు ఒక గ్యాలంటరీ మెడల్, రెండు ప్రెసిడెంట్ మెడల్స్, 11 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ దక్కాయి.
పోలీస్ కానిస్టేబుల్ కాట్రావత్ రాజునాయక్ శౌర్య పతకానికి ఎంపికయ్యారు. మ్యాతరి సిద్ధయ్య (ఏఎస్‌ఐ), హెస్సేన్ నిడమనూరి (హెడ్ కానిస్టేబుల్)లతో పాటు మరో ఇద్దరికి రాష్ట్రపతి పతకాలు లభించాయి. రాష్ట్రానికి చెందిన 11 మంది అధికారులు, సిబ్బంది ప్రతిష్ఠాత్మక ప్రశంసనీయ సేవా పతకాలకు ఎంపికయ్యారు. నల్లమల రవి(డీసీపీ), తోగరు కరుణాకర్(డీసీపీ), జే షేక్ షమీర్(డీసీపీ), పుట్టా దేవదాస్(కమాండెంట్), మేకల అబ్రహం (ఏఆర్‌ఎస్‌ఐ), షిండే ప్రకాశ్(ఏఆర్‌ఎస్‌ఐ), ముడావత్ దశరథ్(ఏఆర్‌ఎస్‌ఐ), రామ్‌దులార్ సింగ్ (ఏఆర్‌ఎస్‌ఐ), మొహద్ మొయిజుద్దీన్(ఏఎస్‌ఐ),
రాజేశ్ ఉని శ్రీనివాస్ (ఏఎస్‌ఐ), రుద్ర కృష్ణ కుమార్(ఏఎస్‌ఐ) ప్రశంసనీయ సేవా పతకాలకు ఎంపికైన వారిలో ఉన్నారు. వీరందరికీ నేడు జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అవార్డులు ప్రదా నం చేస్తారు. దేశవ్యాప్తంగా పోలీసు బలగాల్లో సుదీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో, నిజాయతీ, అంకితభా వంతో విశిష్ట సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభు త్వం ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సం దర్భంగా ఈ పతకాలను ప్రదానం చేస్తుంది.
ఎలాం టి రిమార్కులు లేకుండా, ఉత్తమ సేవలు అందించిన వారినే ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. ఇది ఒక పోలీసు అధికారి వృత్తి జీవితంలో లభించే ముఖ్యమైన గౌరవాల్లో ఒకటిగా పరిగణిస్తారు.