calender_icon.png 23 October, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ ఆసుపత్రులపై పర్యవేక్షణ ఎక్కడ?

23-10-2025 01:46:08 AM

- అప్పుడు ఇప్పుడు అంటున్న అధికార యంత్రాంగం 

- నామమాత్రంగా పర్యవేక్షణ ఫలితం శూన్యం 

-లేని రోగాన్ని ఉన్నదని రిపోర్టు... స్పందించని వైద్యశాఖ

 మహబూబ్ నగర్ టౌన్, అక్టోబర్ 22: మనిషి మనగడకు ఆరో ప్రాణం తన ప్రాణ మే. తన ప్రాణం పైన పెట్టుబడి ఎంతైనా పెట్టేందుకు మనిషి ఒక్క క్షణం కూడా ఆలోచించే పరిస్థితి ఉండదు. ఇందుకు ఎవరు అతిథులు కారు. ఇదే అదునుగా చేసుకొని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఆడిందే ఆట పా డిందే పాట అని తీరుల వ్యవహరిస్తున్నారని కొంతమంది రోగులు చెబుతున్న మాట.

ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ నియమ నిబంధనలకు లోబడి నడిపించాలని ప్రభుత్వము ఒక శాఖను ఏర్పాటు చేసి సంబంధిత అధికారులను నియమించినప్పటికీ ప్రజలకు ఆశించిన స్థాయిలో మేలు జరగడం లేదని రోజురోజుకు సమాధానం దొరకని ప్రశ్నలా మిగిలిపోతుంది. వార్తలు వాస్తవాలు అధికారులకు తెలిసిన శరమాములే సమాజాన్ని అంత మార్చలేము కదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడుముతో ప్రజల సైతం వ్యవస్థ ఇం తేనా అని అనుకోక తప్పడం లేదు. మనిషి మరణిస్తేనే నామమాత్రంగా అలాంటి ఆసుపత్రులను ఒకటి రెండు రోజులు వారం రో జులు మూసి ఉంచి సీజ్ చేశామని ప్రకటన లు చేసి ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఆయా ఆసుపత్రులు తిరిగి ప్రారం భమవుతున్న ఈ అంశం చాలా చిన్నదిగానే చూసే పరిస్థితులు నెలకొంటున్నాయి. 

- చర్చనీ అంశమైన టీనా సంతాన సాఫల్య కేంద్రం...

 ఇటీవల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న హన్వాడ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి తన భార్యతో కలిసి తమకు పిల్లలు పుట్టడం లేదని జిల్లా కేంద్రంలోని టీ నా సంతాన సాఫల్య కేంద్రా న్ని సంప్రదించారు. వివిధ వైద్య చికిత్సలు చేసిన క్రమంలో భాగంగా టెస్టులు చేసి హై పటైటిస్ -బీ పాజిటివ్ ఉందంటూ రిపోర్టును అందించారు. టీనా ఆస్పత్రి పై అనుమానం రాజు హైదరాబాదులోని విజయ డయాగ్నస్టిక్, అపోలో ఆసుపత్రిలో మరోసారి పరీక్ష లు చేయించారు. అక్కడ వచ్చిన రిపోర్టులో ఎలాంటి రోగం లేదని నిర్ధారణ చస్తూ రి పోర్టు వచ్చింది. దీంతో ఆ రిపోర్టులను తీసుకొని ఆస్పత్రికి వచ్చి బంధువులతో కలిసి రాజు ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. 

- పర్యవేక్షణ నిల్... ఫలితం శూన్యం...

 ప్రైవేట్ ఆస్పత్రులపై సంబంధిత అధికార యంత్రాంగం పర్యవేక్షణ చేయడం లేద ని ఆరోపణలు ఊపొందుకుంటున్నాయి. ఇ ప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆసుపత్రిలో ఏ రోగానికి ఎంత ఖర్చు ఉంటుందో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చే యాలని చెప్పినప్పటికీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఆ నిబంధనలు అస్సలు పట్టించుకో వ డం లేదు. వైద్య ఆరోగ్యశాఖ సైతం ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వే యకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. ప్రజలు అరచేతిలో ప్రాణాలు పట్టుకొని ఆస్పత్రిలో బాగు చేస్తారని వస్తే కాసుల చర్చిల తప్ప ఆ ప్రాణానికి కాపలదారులుగా వెనకడుగు వే స్తున్నారని ఆరోపణలు సైతం పలు ఆస్పత్రులపై ఉన్నాయి.

కొన్ని సందర్భాలలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స చేయు సమయంలో గానీ ప్రాణం పోయిందంటే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అందరు ఒకటై ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి ఆలోచిస్తున్నారు. తప్ప మరి ఇతర ఎంక్వయిరీ జరగడం లేదనిది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమస్య జటి లం కాకుండా ఆయా ప్రైవేట్ హాస్పిటల్స్ ప్ర శాంతంగా నిర్వహణ ఉండేలా ఎప్పటికప్పు డు వైద్యులు ఏకమవుతూ అడుగులు వేస్తున్నారు. ఇది మంచిదే అయినప్పటికీ సదరు వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యా యి ఎందుకు ఆ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది అనే విషయంలో కూడా పునరాఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చెబుతున్న మాట.

 పర్యవేక్షణ చేస్తాం...

 టీన సంతాన సాఫల్య కేంద్రం తో పాటు ప్రైవేట్ ఆస్పత్రులపై పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇ బ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు ప్రై వేట్ ఆస్పత్రుల వైద్యులకు కూడా సూచనలు చేస్తున్నాం. నిబంధనలను అతిక్ర మించి రోగులను ఇబ్బంది పెడితే చర్య లు తీసుకుంటాం. పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేయడం జరుగుతుంది త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తాం.

పద్మజ, ఇన్చార్జి డిఎంహెచ్వో, మహబూబ్‌నగర్