calender_icon.png 13 July, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా పత్తి పంటను ధ్వంసం చేశారు

12-07-2025 08:05:01 PM

విలేకరులతో దళిత రైతు మొర

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): అటవీ శాఖ అధికారులు పట్టా భూమిలో సాగు చేసిన పత్తి పంటను ధ్వంసం చేసి రూ.2 లక్షల వరకు తమకు పంట నష్టం చేశారని బాధిత రైతు కాసిపాక రాజం ఆరోపించారు. శనివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తన గోడును వెల్లబుచ్చారు. నెన్నెల మండల కేంద్రం లోని సర్వే నెంబర్ 671 లో తన బావమరిది చిప్పకుర్తి మల్లేష్ కు 4 ఎకరాలు,తన మామ చిప్పకుర్తి రాజపోచంకు 4 ఎకరాల లావని పట్టా భూమి ని1987 లో గత ప్రభుత్వం ఇచ్చిందన్నారు.

ఈ భూమిని వారి కూతురు అయినా తన భార్య కాసిపాక రాజుకు 2015 లో గిఫ్ట్ కింద రాసి ఇచ్చారని తెలిపారు. ఈ భూమిని గతపదేళ్లుగా సాగుచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కుషనపల్లి రేంజ్ అధికారి దయాకర్, డిప్యూటీ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ, బీట్ అధికారులు తొంగల గోపి, మహేష్ లు దౌర్జన్యంగా  తమ భూమివద్దకు ఈనెల 10న  సాగు చేసిన పత్తి పంటను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. అక్కడి ఉన్న విద్యుత్ మోటార్లు, పైపులను తీసుకువెళ్లారని  ఆయన ఆరోపించారు.

ఎందుకు ఇలా చేస్తున్నారనీ అడుగుతే ఇదంతా అటవీ శాఖ భూమిని, లేకుంటే ఐదు రూ.5 లక్షలు ఇస్తే భూమిని వదిలేస్తామని బహాటంగానే ముడుపులు అడిగారని వెల్లడించారు. అంతటితో కాకుండా తన పై తప్పుడు కేసు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకి గురిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.