27-01-2026 01:04:32 AM
మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరిక
చేవెళ్ల జనవరి 26 (విజయక్రాంతి): మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కెటిఆర్ సమక్షంలో హైదరాబాదులోని తెలంగాణ భవన్లో సోమవారం బిఆర్‌ఎస్ పార్టీలో చేవెళ్ళ మాజీ ఎంపీపీ మల్గారి విజయ భాస్కర్ రెడ్డి నాయకులు కనక మామిడి మల్లారెడ్డి పెంజర్ల అనంత రెడ్డి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం వారు మాట్లాడుతూ... ఉద్యమ బీఆర్‌ఎస్ పార్టీతోనే రాష్ట్ర సిద్ధించిందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం హయాంలో ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాల అందించిన ఘనత బీఆర్‌ఎస్ కు ఉందన్నారు. ఉద్యమ పార్టీ ప్రజలతో పెనవేసుకుందని హస్తం పార్టీ ప్రజలకుచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైదన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి అధికారం చేపడుతుందని చెప్పారు.
రాష్టం ఏర్పాటులో కార్యకర్తలు చేసిన వెనుతిరుగని పోరాట పటిమ పార్టీ కుందన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, కనీస వేతనాల మాజీ చైర్మన్ నారాయణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, గోనె కరుణాకర్ రెడ్డి, దేశమొల్ల ఆంజనేయులు, నత్తి కృష్ణారెడ్డి, పట్లోళ్ల హనుమంత్ రెడ్డి, దండు సత్యం, జూకన్నగారి జైపాల్ రెడ్డి, అత్తిలి రాఘవేందర్ రెడ్డి, తలారి యాదయ్య, గుడిపల్లి శేఖర్ రెడ్డి, మిట్ట రంగారెడ్డి, ఊరడి రాంప్రసాద్, చందు, తలారి వెంకట్, చాకలి కృష్ణ, సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.