30-08-2025 05:40:25 PM
సనత్‌నగర్ (విజయక్రాంతి): బల్కంపేట్‌లో ఏర్పాటు చేసిన సిద్ధివినాయక గణేశ్ మండపం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కళ్యాణ్, కోమల్ ఆహ్వానంతో అమీర్‌పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శేషు కుమారి(Former Corporator Seshu kumari) గణేశ్ మండపాన్ని సందర్శించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొని భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో శేషకుమారికి శాలువాతో సన్మానం కూడా నిర్వహించారు. ఈ వేడుకల్లో కూతురు నరసింహ, మల్లికార్జున్, కార్తీక్, సతీష్, లక్ష్మి తదితరులు పాల్గొని గణేశుని ఆశీర్వాదాలు అందుకున్నారు.భ క్తుల ఉత్సాహం, నిర్వాహకుల కృషితో గణనాథుని ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.