30-08-2025 05:43:43 PM
ప్రస్తుతం ఎటువంటి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ చేయడం లేదు
దళారులను నమ్మి ఎవరు డబ్బులు చెల్లించ వద్దు
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..
పెద్దపల్లి (విజయక్రాంతి): ఉద్యోగాలు ఇప్పిస్తామని జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని ఏ ప్రభుత్వ శాఖ పరిధిలో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతులలో నియామకాలు జరగడం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒకవేళ వివిధ అవసరాలపై తాత్కాలిక ప్రాతిపదికన ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతులలో నియామకాలు చేపడితే కలెక్టర్ ఆధ్వర్యంలో అర్హతలు పరిశీలించి, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతులలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది దళారులు అమాయకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, నియామక ప్రక్రియలో డబ్బుకు, సిఫార్సులకు ఎక్కడ ఆస్కారం ఉండదని, ప్రజలు ఎవరు అనవసరంగా దళారులను నమ్మి మోసపోవద్దని, అనవసరంగా డబ్బును కోల్పోవద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.