08-07-2025 01:04:54 AM
కుత్బుల్లాపూర్, జులై 07(విజయ క్రాంతి): కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వభూమిని కొందరు పట్టపగలు నిర్మాణాలు చేపడుతున్నారని దుండిగల్ తహసీల్దార్ సయ్యద్ మతిన్ కు మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్ సోమవారం ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రితం 1000 గజాల స్థలం దుండిగల్ తాండ ప్రజల అవసరం కోసం మల్టి పర్పస్ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఇప్పటి వరకు కేటాయించలేదని అన్నారు.కొందరు ఖబ్జా దారులు ఆ స్థలాన్ని పట్ట పగలే కబ్జా చేసుకొని నిర్మాణం చేస్తుంటే అధికారులలో ఎలాంటి చలనం లేదని వాపోయారు.
వెంటనే కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, సరిహద్దులు తేలేవరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టాకూడదని వివరించారు. 684 సర్వే నెంబర్ లోని 425.24ఎకరాలు గుర్తించి సరిహద్దులు ఏర్పాటు చేయాలనీ సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవీందర్ నాయక్ పాల్గొన్నారు.