calender_icon.png 8 July, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుయ్యాడి పీరిలకు రాష్ట్రంలోనే ప్రత్యేకత

08-07-2025 01:05:36 AM

- హస్సేన్ హుస్సేన్ దేవస్థానాన్ని దర్శించుకున్న కలెక్టర్ రాజర్షిషా 

ఆదిలాబాద్, జూలై 7 (విజయక్రాంతి ): మొహర్రం వేడుకల్లో ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో పేరుగాంచిన జిల్లా అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన రుయ్యాడి హస్సేన్ హుస్సేన్ దేవస్థానాన్ని కలెక్టర్ సోమవారం దర్శించుకున్నారు.

గ్రామానికి వచ్చిన కలెక్టర్ కు హస్సేన్ హుస్సేన్ దేవస్థానం నిర్వాకులు, విజయ డెయిరీ రాష్ట్ర మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా హస్సేన్ హుస్సేన్ దేవస్థానంలో పీరిలకు కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జరుపుకునే మొహరం వేడుకలు మతసామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తున్నాయని అన్నారు. రుయ్యాడి సావార్లకు రాష్ట్రంలోనే ఎంతో ప్రత్యేకత ఉందని మన జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుండి  మహారాష్ట్ర నుండి పెద్దఎత్తున భక్తులు వచ్చి పిరీలను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.