22-05-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం మే 21 (విజయ క్రాంతి) సీతారామ ఎత్తిపోతల పథకం కెనాల్ భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీతారామ ఎత్తిపోతుల పథకం కెనాల్ భూ సేకరణ పై ఇరిగేషన్, సర్వే అధికారులతో కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ సీతారామ కెనాల్ నిర్మాణానికి భూసేకరణ కోసం గ్రామసభలు నిర్వహించాలన్నారు. జిల్లావ్యాప్తంగా వారం రోజుల్లోగా గ్రామసభలు నిర్వహణ పూర్తి చేయా లన్నారు. కాల్వల ఏర్పాటుతో రైతులకు భూమి విలువ పెరుగుతుందని అవగాహన కల్పించాలన్నారు. ఇరిగేషన్ అధికారులు సర్వేయర్లు సమన్వయంతో భూసేకరణ పూర్తి చేయాలని ఆదే శించారు.
సర్వేయర్లకు అవసరమైన ఆధునిక యంత్ర పరికరాలు, లాప్టాప్ లు అందజేస్తామన్నారు. భూ సర్వే లో ఆధునిక పద్ధతులను అవలంబించి వేగవంతంగా భూ సర్వే పూర్తి చేయాలన్నారు. భూ సర్వే లో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టండి
ఇరిగేషన్ అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులలో పూడిక తీసే విధంగా ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. చెరువుల వద్ద మార్కింగ్ ఏర్పాటు చేసి అవసరమైన రైతులకు పొలాల్లో ఉపయోగించుకునేందుకు మట్టిని తీసుకు వెళ్లే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్నా రు.అధికారులందరూ దీనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో స్పెష ల్ డిప్యూటీ కలెక్టర్ లు కాశయ్య, సుమ, ఇరిగేషన్ శాఖ ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి, ఈ ఈలు అర్జున్ రావు, సురేష్ కుమార్ అశ్వరావుపేట, ఇల్లందు ఈఈ చారి, డి ఈలు,సర్వేయర్లు పాల్గొన్నారు.