calender_icon.png 26 August, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పడకేసిన పారిశుధ్యం.. విజృంభిస్తున్న వ్యాధులు

26-08-2025 01:02:11 AM

* పారిశుధ్య నిర్వహణ లోపం 

* ప్రబలుతున్న వ్యాధులు 

* మంచాన పడుతున్న రోగులు 

ఎర్రుపాలెం, ఆగస్టు 25( విజయ క్రాంతి):మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పారిశుధ్య పనులు లోపించడం వలన వ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రామాలలో సర్పంచ్ ల పదవీకాలం ముగియడంతో ప్ర భుత్వం మండలంలోని అన్ని గ్రామాలకు ప్ర త్యేక అధికారులను నియమించింది.

అన్ని గ్రామాలలోని గ్రామ కార్యదర్శులకు గైడ్లైన్స్ ఇవ్వడం, గ్రామాలలో చేపడుతున్న అభివృ ద్ధి కార్యక్రమాలు, ప్రజల అవసరాలు, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ ము ందుకు వెళ్లాలని ప్రత్యేక అధికారులకు ప్రభు త్వం నిర్దేశించింది. అయితే గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ లోపం వలన అన్ని గ్రా మాలలో వ్యాధులు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు జ్వరం మలేరియా డెంగీ లాంటి వ్యాధులు విజయం ఇస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గ్రామాలలో ఖాళీ ప్రదేశా లలో చెత్త పెరగడం వలన దోమలు విజ్రింబిస్తున్నాయి. మురుగు కాలువల నిర్వహణ లోపం వలన దోమలు పెరిగి గ్రామాలలో జ్వరం సంబంధించిన వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతి గ్రామంలో చెత్తను సేకరించి ద్వారా గ్రామం వెలుపల ఒకచోట పడవేయవలసి ఉంటుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం మండలంలోని అ న్ని గ్రామాలకు ట్రాక్టర్ లను ఏర్పాటు చేసిం ది. గ్రామాలలో ప్రతిరోజు చెత్తను సేకరించి ట్రాక్టర్ ల ద్వారా గ్రామం వెలుపల ఖాళీ ప్ర దేశంలో డంపు చేయవలసి ఉంది. ప్రతి గ్రా మంలో ఇది కొరవడినది. వారానికి ఒకసారి మాత్రమే గ్రామంలో ట్రాక్టర్ల ద్వారా చెత్తను సేకరించి గ్రామం వెలుపల డంపు చేస్తున్నా రు.

దీనివలన గ్రామాలలో చెత్త పేరకపోవ డం వలన దోమలు విజృంభించి అనేక రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రజలు వీటి బారినపడి ఆసుపత్రుల చుట్టూ రోజు తిరుగుతున్నారు. గ్రామాలలో ఖాళీ ప్రదేశాలలోని పిచ్చి మొక్కలను తొలగించి, దోమల నివారణకు చర్యలు తీసుకోవడం, రోడ్ల పైన బ్లీచింగ్ పౌడర్ చలినట్లయితే కొంతవరకైనా వ్యాధులనుండి ప్రజలను కాపాడవచ్చును కానీ ఇలాంటి చర్యలను గ్రామాలలో ఇంతవరకు ప్రభుత్వ అధికారులు చేపట్టకపోవ డంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

గ్రామాలలో నెలకొని ఉన్న పా రిశుధ్య పనులను వెంటనే చేపట్టాలని ప్రజలను రోగాల బారి నుండి కాపాడాలని ప్రభు త్వాన్ని మండల ప్రజలు కోరుతున్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య పనులను వెంటనే చేప ట్టాలి .. సిపిఎం, మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో వెంటనే పారిశుధ్య పనులను చేపట్టి ప్రజలను రోగాల బారి నుండి కాపాడాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దివ్యల వీరయ్య, సిపిఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ రావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.