08-07-2025 01:23:03 AM
ఖమ్మం, జులై 07 (విజయ క్రాంతి); ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభి షేక్ అగస్త్య అన్నారు. మున్సిపల్ కార్యాలయం లో సోమవారం నిర్వహించిన ప్రజా వాణికి వివిధ ప్రాంతాల వారు తమ తమ సమస్యలపై అధికారులకు దరఖాస్తులు అం దజేశారు.
ఖమ్మం 14 వ డివిజన్ కార్పొరేటర్ కూరాకుల వలరాజు, 6వ డివిజన్ కా ర్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు వారి డివిజన్ లోనో సమస్యలపై కమిషనర్ కు విన తిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వ చ్చే దరఖాస్తులను అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం సమస్యలు పరిష్కారం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమిషనర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.