30-10-2025 04:34:20 PM
 
							క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయాలి, నష్ట పరిహారం చెల్లించాలి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్
ముకరంపురా (విజయక్రాంతి): మొంథా తుపాన్ తో కురిసిన భారీ వర్షాల వల్ల నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆడుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరగాళం కష్టం చేసి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో మెంతా తుపాన్ తో వరి ధాన్యం, పత్తి పంట నేలమట్టం అయ్యిందని, కళ్ళల్లో వడ్లు తడిసయాని, పత్తి నీటితో తడిసి ముద్ద అయ్యిందని,రైతులకు కన్నీరే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి రెవిన్యూ, వ్యవసాయ అధికారులతో క్షేత్ర స్థాయిలో పంట నష్టం పై అంచనా వేసి వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని, తడిసిన ధన్యాన్ని, పత్తి ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని అన్నారు ప్రభుత్వం స్పందించి రైతులను ఆడుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పండించిన పంటలకు చేసిన అప్పులు కట్టలేక ఆత్మ హత్యలు చేసుకునే పరిస్థితులు దాపురిస్తాయని వెంటనే ప్రభుత్వ అధికారులు పంట నష్టంపై అంచనాలు వేసి వారికీ భరోసా కల్పించాలని సృజన్ కుమార్ కోరారు.