calender_icon.png 23 July, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద ఆత్మగౌరవ ప్రతీక రేషన్ కార్డు

23-07-2025 12:18:23 AM

ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ 

నాగర్ కర్నూల్ జూలై 22 (విజయక్రాంతి)నిరుపేదల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా వారి ఆత్మగౌరవ ప్రతీకగా రేషన్ కార్డు నిలుస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే వం శీకృష్ణ అన్నారు. మంగళవా రం నియోజకవర్గంలోని వం గుర్ మండలం మిట్ట సద్దగోడు గ్రామంలో మంగళవా రం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం నిరుపేదల హార్దిక అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే సన్నబియ్యం పంపిణీ, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అనంతరం వంగూరు నుండి వెలమల పల్లె గ్రామానికి వెళ్లేందుకు నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. వారి వెంట కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులుఉన్నారు.