22-08-2025 12:57:03 AM
1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా
మహబూబ్ నగర్ టౌన్ ఆగస్టు 21 : అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగినప్పుడే సరైన గుర్తింపు లభిస్తుందని 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ సర్కిల్ లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ట్రాన్స్కో మహబూబ్ నగర్ రీజనల్ అధ్యక్షులు గాజే రఘువీర్ రెడ్డి, సెక్రటరీగా రీజనల్ రాఘవేందర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి,
అడిషనల్ సెక్రెటరీ వై స్వామి గౌడ్, రీజనల్ ఉపాధ్యక్షులుగా టి స్వాతి, శివ కుమార్, రీజనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎండి ఇక్బాల్, సి.హెచ్ చెన్నయ్య, అసిస్టెంట్ సెక్రెటరీ సి సత్యనారాయణ, రీజనల్ ట్రెజరర్ గా ఎండి మక్సూద్ అలీ లాను ఎన్నుకున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ ఐక్యంగా ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదాం అని తెలిపారు. అప్పుడే ప్రతి ఉద్యోగి సంతోషంగా జీవనం గడిపేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు తదితరులు ఉన్నారు.