22-08-2025 12:58:22 AM
ఆసక్తి గల పేద విద్యార్థులకు ఎమ్మెల్యే యెన్నం చేయూత
దరఖాస్తులు చేసుకోవాలంటున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్ ఆగస్టు 21 (విజయ క్రాంతి) : నిరుపేదలు ఇంజనీరింగ్ విద్య చదవాలంటే... ఫీజుల భారం తో వెనకంజ వేస్తున్నారని గమనించిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నూతన విధానానికి శ్రీకారం చుట్టారు.
ఎక్కడ లేని విధంగా మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెంది నిరుపేదలై ఉండి ఇంజనీరింగ్ విద్య పై మక్కువ ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రత్యేక ప్రకటన జారీ చేశారు.
ఉన్నత విద్యను నిరుపేద విద్యార్థులకు అందించాలని సంకల్పంతో సొంత డబ్బులతో పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే వేస్తున్న అడుగులకు నిరుపేద విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఉన్నత విద్యలను కూడా పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.