calender_icon.png 25 August, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పేరుతో గుట్టలను మాయం చేస్తుర్రు..

25-08-2025 07:26:59 PM

డివైఎఫ్ఐ జిల్లా నాయకులు మాటూరు సతీష్.

రేగొండ (విజయక్రాంతి): అభివృద్ధి పేరుతో ప్రకృతి సంపదను మాయం చేస్తున్నారని డివైఎఫ్ఐ జిల్లా నాయకులు మాటూరు సతీష్(DYFI district leaders Mathur Satish) మండిపడ్డారు. మండలంలోని బాగిర్తిపేట, దుంపిల్లపల్లి, గూడెపల్లి, గ్రామ శివారులలో ఉన్న గుట్టలను ఆనవాళ్లు లేకుండా చేస్తూ అభివృద్ధి పేరుతో ప్రకృతి అందించిన సహజ సంపదలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ అందులో వచ్చే మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. గుట్టలను అక్రమంగా పట్టాలు చేసుకుని సహజ సంపదకు నష్టం వాటిల్లే విధంగా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, మైనింగ్ అధికారులను వారు డిమాండ్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణకై గుట్టలు, అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని ఈ విధంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు పాల్గొన్నారు.