calender_icon.png 25 August, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్ బాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

25-08-2025 07:37:11 PM

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్, మంత్రి శ్రీధర్ బాబుని కోరారు. హైదరాబాద్‌లోని మంత్రి శ్రీధర్ బాబు నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి పనులకు జిహెచ్ఎంసి నిధుల నుండి 25కోట్లు  మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. గతంలో ఇదే విషయంపై మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి కొరకై వెంటనే నిధులను మంజూరు చేసేందుకు అధికారులకు సూచిస్తానని హామీ ఇచ్చారు.