25-08-2025 07:38:10 PM
కలెక్టర్కు రేషన్ డీలర్ల వినతి
యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు కేంద్ర ప్రభుత్వం గత ఐదు నెలలుగా ఇవ్వాల్సిన కమిషన్ ఇప్పించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఏలుగల రాజయ్య(District President Yelugala Rajaiah) ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు సోమవారం నాడు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో తహసిల్దార్ లకు రేషన్ డీలర్లు వినతి పత్రాలను అందజేశారు. ఏప్రిల్ మాసం నుండి ఆగస్టు మోసం వరకు ఐదు నెలల కమిషన్ ఇవ్వాలని అధికారులకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ప్రతి రేషన్ డీలర్ కు 5000 రూపాయల గౌరవ వేతనం కమిషన్ 140 రూపాయల నుండి 300 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన అనంతరం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
22 నెలల కాంగ్రెస్ పాలనలో రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కనీసం ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడం విచారకరమన్నారు. ఐదు నెలల నుండి కమిషన్ రాకపోవడంతో డీలర్లు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఈ నెల 31 లోపు కమిషన్ ప్రభుత్వం విడుదల చేయనట్లయితే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని జిల్లా అధ్యక్షులు రాజయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల శంకర్ కార్యదర్శి రేపాక రమేష్ జిల్లా గౌరవ అధ్యక్షులు యాదగిరి కోశాధికారి మా దర్శన్ రెడ్డి కార్యవర్గ సభ్యులు అశోక్, బోనగిరి, రాజాపేట, ఆలేరు మండలాల అధ్యక్షులు గంగాదేవి, మహేష్, బొచ్చయ్య, రోశయ్య, శ్రీనివాస్, యుగంధర్, రమేష్, నారాయణరెడ్డి, కృష్ణ, మంజుల అమృతమ్మ నమిలే నర్సింగ్ రావు శివ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.