02-11-2025 07:53:19 PM
ఉమ్మడి నల్లగొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ..
కోదాడ: ఉనికిని కాపాడుకునేందుకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అసత్య ఆరోపణలు చెప్తున్నారని ఉమ్మడి నల్లగొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. మల్లయ్య యాదవ్ మంత్రి ఉత్తమ్ దంపతులపై విమర్శలు చేస్తూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఆదివారం తీవ్రంగా ఖండించారు.
గ్రామీణ ప్రాంత యువత ముంగిటికే హుజూర్నగర్ లో మెగా జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేసి హైదరాబాదులోని ప్రముఖ కంపెనీలను తీసుకువచ్చి వారి అర్హతలకు తగిన ఉద్యోగాలను ఎంచుకునే అరుదైన అవకాశాన్ని కల్పించిన ఘనత ఉత్తంకుమార్ రెడ్డిది అని అన్నారు. ఉత్తం పద్మావతిల మానసిక పుత్రిక సన్న బియ్యం పథకం అని ఇది తెలంగాణ ప్రభుత్వంలో పెద్ద గేమ్ చేంజర్ గా మారిందని ఈ విషయం మాజీ ఎమ్మెల్యే గుర్తుంచుకోవాలని అన్నారు. చౌకబారు విమర్శలు మల్లయ్య మానుకోవాలని, లేకుంటే నియోజకవర్గం ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.