02-11-2025 07:55:51 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): వికలాంగులకు, వృద్ధులకు శ్రీ రాజమాత ఫౌండేషన్ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని ఫౌండేషన్ అధ్యక్షుడు ఉదయ్ రెడ్డి అన్నారు. పోచారం మున్సిపల్ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో ఆదివారం ఇద్దరు వికలాంగులకు వీల్ చైర్ లు అందించి అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రాజమాత ఫౌండేషన్ దాతలు అందిస్తున్న సహకారంతో నగరంతో పాటు అన్ని ప్రాంతాలలో నిరుపేదలను అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. మహిళలకు, ఉపాధి అవకాశాలు కల్పించడం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, టీం సభ్యులు శ్రీనివాన్ రెడ్డి, సింహ, పవన్, విజయ్, సాయి, తదితరులు పాల్గొన్నారు.