02-11-2025 07:51:02 PM
రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దు..
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, రైతులు ఎవరు అధైర్యపడవద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, ఆదివారం సాయంత్రం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి సింగిల్ విండో పరిధిలోని ఐతరాజుపల్లి, గర్రెపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో, అధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల పంటలు అంచనా వేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి 5వ సారి కొనుగోల్లు జరుపుతున్నామని, ఎప్పటిలాగే ఏ సెంటర్లో కూడా రైతులకు సమస్య రానీయమని చెప్పారు.
ఎలాంటి కటింగులు లేకుండా కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. రైతులు కూడా వడ్లను ఆరబెట్టి 17 శాతం లోపు తేమ ఉండేట్టు చూడాలని కోరారు. వడ్లను అమ్మిన 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని చెప్పారు. కేవలం కొనుగోలు కేంద్రాలలో వడ్లను అమ్మి ట్రక్ షీట్లు పొంది రైతులు ఇండ్లలో ఉండచ్చని, రైస్ మిల్లులకు తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు ఉన్న తమకు రైతులు నేరుగా సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం చెర్మన్ అంతటి అనయ్య గౌడ్, మార్కెట్ చెర్మన్ మినుపల ప్రకాష్ రావు, సింగల్ విండో చెర్మన్ సందీప్ రావు,కాలేపల్లి జానీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.