calender_icon.png 17 May, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారికి మొక్కు తీర్చుకున్న మాజీ ఎంపీ రావుల

17-05-2025 12:00:00 AM

పెబ్బేరు మే 16: మండలకేంద్రంలోని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆలయాన్ని శుక్రవారం మాజీ ఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో బాగంగా ఆయన తల్లి రావు ల పద్మమ్మ జ్ఞాపకార్థం గా మొక్కు చెల్లించారు. శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప ఆలయంలో ఇటీవల నిర్మించిన శ్రీ లలితా త్రిపుర సుం దరి దేవి అమ్మవారికి 50 తులాల వెండి ఆభరణాలు బహూకరణం చేశారు.

ఈ సం దర్భంగా ఆలయకమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించి, రావుల ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గురు స్వామి వడ్డె ఈశ్వర్, దిలీప్ రెడ్డి, విశ్వరూపం, వనం రాములు, వడ్డె రమేష్ ఆలయ భక్త బృందం పాల్గొన్నారు.