calender_icon.png 25 August, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌరాయిపల్లి పాఠశాలలో నీటి మోటారు పంపు చోరీ

25-08-2025 07:28:53 PM

యాదగిరిగుట్ట (విజయక్రాంతి): యాదగిరిగుట్ట మండలం(Yadagirigutta Mandal) గౌరాయిపల్లి గ్రామంలో గల పాఠశాలలో మోటారు చోరీకి గురయింది. నీటి సంపుపై సేఫ్టీ మూతను తొలగించి మోటార్లను దొంగిలించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లేఖ ద్వారా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకుని స్కూలు మోటార్లను తిరిగి తీసుకురావాల్సిందిగా కోరారు. చదువుకునే పాఠశాలలో దొంగతనం చేయడం అమానుషమని, అసలు సమాజంలో చదువు అనేది లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనీ, గుడి బడి అని తేడా తెలియకుండా ప్రస్తుత సమాజం పోకడ ఉందని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా పోలీస్ శాఖ వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.