15 April, 2026 | 11:10 AM

కేటీఆర్, ప్రశాంత్ రెడ్డిని కలిసిన మాజీ జడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు

02-01-2026 12:00 AM

నిజాంసాగర్, జనవరి 1 (విజయ క్రాంతి): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గురు వారం రోజు తెలంగాణ భవన్లో ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు టబీ ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం  బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని  దఫెదర్ రాజు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సంక్షిప్తంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా నాయకుల మధ్య ఆత్మీయ వాతావరణం నెలకొంది.