23-11-2025 01:00:44 AM
రాజేంద్రనగర్, నవంబర్ 22 (విజయ క్రాంతి) : పీవీఎన్‌ఆర్ తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం 11వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య, రవా ణా శాఖ కార్యదర్శి డాక్టర్ కె. ఇళంబర్తి ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలో భాగంగా, ఐసిఏఆర్-షెడ్యూల్ కుల ఉప ప్రణాళిక నిధుల కింద మంజూరు చేసిన ఇ-రిసోర్సెస్ (పుస్తకాలు, జర్నల్స్) ను ఆయన ప్రారంభించారు,
వీటిని పశువైద్య, డెయిరీ టెక్నాలజీ, ఫిషరీస్ విభాగలలోని ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులందరూ పొందవచ్చునని తెలిపారు. వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ నందు అందుబాటులో ఉన్న సౌకర్యాలను కూడా ఆయన సందర్శించారు. పాడి రైతులకి, పెంపుడు జంతువుల యజమానులకు అందించే ఉత్తమ క్లినికల్ సేవలను ప్రశంసించారు. ఈ సందర్బంగా విశ్వవిద్యాలయం 11వ వార్షిక నివేదికను విడుదల చేసి ‘అలుమ్ని కనెక్ట్‘ను వర్చువల్‌గా ప్రారంభిం చారు.
పశువైద్యుడిగా ఆయన ప్రజారోగ్యం పరంగా ఈ రంగం ప్రాముఖ్యతను వివరించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డాక్టర్ రాజీ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లలో పరిమితుల మధ్య సాధించిన పురోగతిని ప్రశంసించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఎం. జ్ఞాన ప్రకాష్, ఈ కార్యక్రమం లో రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. శరత్చంద్ర, వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ జ్ఞాన ప్రకాష్, డాక్టర్ కె. ఇళంబర్తి, ఐఎ ఎస్, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజారెడ్డిని సత్కరించారు.