calender_icon.png 23 November, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాస్ యాక్షన్ దాషమకాన్

23-11-2025 12:58:23 AM

హరీశ్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా ద్విభాషా చిత్రం ‘దాషమకాన్’. ఐడీఏఏ ప్రొడక్షన్స్, థింక్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వినీత్ వరప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ శనివారం విడుదల చేశారు. ఈ సినిమాలో హీరో పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయనేది ఈ ప్రోమో చూస్తే తెలుస్తోంది. మరి ఈ రెండు షేడ్స్ వెనుకున్న అసలు కథ తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించేలా ప్రోమో రూపొందింది.

ఈ చిత్రంలో హరీశ్ కళ్యాణ్ సరసన ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తుండగా సత్యరాజ్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బ్రిట్టో మైకేల్ సంగీతాన్నిఅందిస్తుండగా కార్తీక్ అశోకన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జి.మదన్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.