calender_icon.png 23 November, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమంటే.. థియేటర్లలో పాజిటివ్ వైబ్

23-11-2025 12:59:30 AM

ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన చిత్రం ‘ప్రేమంటే’. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, జాన్వీ నారంగ్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 21న విడుదలైంది. తమ సినిమాకు థియేటర్లలో మంచి స్పందన వస్తోందని మేకర్స్ ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ప్రియదర్శి మాట్లాడుతూ.. “మా సినిమాకు వచ్చిన స్పందన చాలా ఆనందాన్నిచ్చింది” అని తెలిపారు.

ఆనంది మాట్లాడుతూ.. “అందరూ అన్ని టెన్షన్స్ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని తీసిన సినిమా ఇది.  థియేటర్లలో పాజిటివ్ వైబ్ ఉంది. ఇలాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చి చాలా రోజులైంది” అని చెప్పారు. డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ కావాలనేది నా డ్రీమ్. అది ఈరోజు తీరినందుకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు.  ‘ప్రేక్షకుల నవ్వులు ఒక నిర్మాతగా తనకు చాలా ఆనందాన్ని ఇచ్చాయ’నని జాన్వి నారంగ్ తెలిపారు.