13-05-2025 12:40:34 AM
ఎమ్మెల్యే బాలునాయక్
దేవరకొండ, మే 12 : దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తానని ఎమ్మెల్యే బాలునాయక్ తెలిపారు. దేవరకొండ మండలంలోని తూర్పుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను, తూర్పుపల్లి నుండి కొమ్మేపల్లి వరకు 2.70 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులు,మహబూబ్ నగర్ జాతీయ రహదారి నుండి దౌరాజ్ తండా వరకు 1.60 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, దేవరకొండ నియోజక వర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు.ప్రతీ గ్రామాలలో మౌళిక వసతుల కల్పనకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అని అన్నారు.సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులను, కాంట్రాక్టర్ లను సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, వడ్త్య దేవేందర్ నాయక్, సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా నర్సింహా రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు లోకాసాని శ్రీధర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు కృష్ణయ్య, మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అద్యక్షురాలు ధనలక్ష్మి బాల నారాయణ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.