calender_icon.png 23 August, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేత

22-08-2025 11:40:36 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న 50 మంది నిరుపేద, తల్లితండ్రులు లేని విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేశారు. కళాశాలలో నిరుపేద, తల్లిదండ్రులు లేని విద్యార్థినిలు చదువుకుంటున్నారని, వారికి అండగా నిలవాలని ప్రిన్సిపల్ సదానంద దాతలకు విజ్ఞప్తి చేయగా ఖమ్మంపాటి పద్మ, విజయ్ దంపతులు 50 మంది విద్యార్థినులకు విద్యార్థులకు పొక్కుల శ్రీకళ చేతుల మీదుగా యూనిఫామ్ లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం దాతలకు సత్కరించారు.