19-07-2025 12:28:51 AM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 5వ డివిజన్ కొత్తూరు జెండాలో 1.03 లక్షల రూపాయలతో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... శంకుస్థాపన చేసిన అనతికాలంలోనే పనులు చేపట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అన్ని డివిజన్ లలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అభివృద్ధికి ప్రజలు సహకరించాలని రానున్న రోజుల్లో నియోజవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు.