calender_icon.png 10 January, 2026 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధుడు అదృశ్యం

09-01-2026 08:25:35 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): ఇంటి నుండి షాప్ కి వెళ్లిన వృద్ధుడు అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేశవ నగర్ లో నివసించే ఎర్రోజు సుభాషిని, ఆమె భర్త ఎర్రోజు వెంకటేశ్వర్లు(66) డిసెంబర్ 26 వ తేది  ఉదయం 10 గంటలకు ఇంట్లో నుండి షాప్ కి వెళ్లివస్తానని చెప్పి, వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు, ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో, అతని భార్య సుభాషిని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని, ఈ వ్యక్తి ఆచూకీ లభిస్తే మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిఐ గోవిందరెడ్డి తెలిపారు.