calender_icon.png 8 January, 2026 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ అభివృద్దే లక్ష్యం

06-01-2026 07:58:20 PM

దాతల సహకారంతో గ్రామాభివృద్ధికి బాటలు

సర్పంచ్ బచ్చలకూరి శీను

గరిడేపల్లి,(విజయక్రాంతి): దాతల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కల్మలచెరువు గ్రామ సర్పంచ్ బచ్చలకూరి శ్రీను అన్నారు. కలమలచెరువు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో దాతల సహకారంతో టాయిలెట్లు, స్టోర్ రూమ్ నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వం అందించే నిధులే కాక గ్రామంలోని దాతలు సహకరం తీసుకొని గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి పనుల కోసం కృషి చేస్తానని తెలిపారు.

గ్రామానికి చెందిన 9వ వార్డు సభ్యుడు ఆరె వెంకటరెడ్డి తల్లి లక్ష్మమ్మ సొంత ఖర్చులతో టాయిలెట్ల నిర్మాణానికి సహకరించగా బి.ఆర్.ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎలుగురు సత్యనారాయణ రెడ్డి నారాయణమ్మ స్టోర్ రూమ్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.గ్రామంలో ప్రజలకు అవసరమైన పనుల విషయంలో దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా దాతల ఇద్దరిని శాలువలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.