06-01-2026 08:02:31 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపెల్లి గ్రామంకు చెందిన కరాటే ప్రొఫెసర్ సంపత్ కుమార్ ను అఖిల భారత ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ కు వైస్ చైర్మన్ గా నియమించారు. ఆస్మావో వ్యవస్థాపకుడు మాస్టర్ సత్యశంకర్ జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్ సందర్భంగా సంపత్ కుమార్ కు నియామకపత్రం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా గట్టపల్లి గ్రామానికి చెందిన ధనాయక్ దామోదర్ రావు, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ నరేష్, గర్రెపల్లి గ్రామం కు చెందిన శ్రీనివాసరావులు మంగళవారం సంపత్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.