06-01-2026 07:51:28 PM
బాతుల కోసం ఏర్పాటుచేసి నీటి గుంత
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన
కామారెడ్డి,(విజయక్రాంతి): బాతులు నీరు తాగేందుకు ఏర్పాటుచేసిన నీటి గుంతలో రెండు సంవత్సరాల బాలుడు పడి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలోని ఫామ్ హౌస్ లో చోటు చేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం... వివరాలు ఇలా ఉన్నాయి. బుద్ధ భాస్కర్, శివ లీల భార్యాభర్తలు ఎనిమిది సంవత్సరాల నుండి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో వాచ్మెన్ గా పనిచేస్తూ నివసిస్తున్నారు.
వారికి రెండు సంవత్సరాల కుమారుడు రన్విత్ కుమార్ అనే బాలుడు ఉన్నాడు. రోజులాగే ఆడుకుంటూ ఉన్న రన్వీత్ కుమార్ సోమవారం సాయంత్రం బాతులు నీరు తాగేందుకు ఏర్పాటు చేసిన నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. కొంత సమయానికి తమ కుమారుడు కనిపించడం లేదని చుట్టుపక్కల వెతకగా బాతుల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన గుంతలు శవం మై తేలాడు.
రెండు సంవత్సరాల కుమారుడు రన్వీత్ కుమార్ శవమై కనిపించడంతో తల్లి శివలీల రోధించడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఓదార్చారు. ఎంతో అల్లారూ ముద్దుగా పెంచుకుంటున్న రన్వీత్ కుమార్ మృతి చెందడాన్ని శివలీల తట్టుకోలేకుండా పోయింది. స్థానికులు వచ్చి ఓదార్చారు. దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుని శవాన్ని మంగళవారం పంచనామ నిర్వహించిన పోలీసులు బాలుని శవాన్ని కామా రెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.