03-01-2026 12:00:00 AM
కోదాడ (అనంతగిరి) జనవరి2: అనంతగిరి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన యువకుడు వద్దేబోయిన సతీష్ పరుగు పందెంలో గోల్ మెడల్ సాధించిన సందర్భంగా గ్రామస్తులు, క్రీడాకారులు శుక్రవారం అభినందించారు.
గత నెల 28 నుండి నేపాలలో జరిగే అంతర్జాతీయ యూత్ గేమ్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో సతీష్ 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని 11.58 సెకన్లలో పూర్తి చేసి గోల్ మెడల్ సాధించారు. ఈ పోటీలో ఇండియా తో పాటు నేపాల్, భూటాన్ దేశాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సతీష్ ను గ్రామస్తులతో పాటు క్రీడాకారులు ప్రత్యేకంగా అభినందించారు.