24-12-2025 02:22:46 AM
కుషాయిగూడ, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్‌ఎస్డీ డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సైనిక్‌పురి కాఫీ కప్ షాప్ సమీపంలో డ్రగ్స్ విక్ర యం జరుగుతోందన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఎల్‌ఎస్డీ సైకోట్రోపిక్ డ్రగ్స్ను అమ్మకానికి తీసుకువచ్చిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన నిందితుడు మునియాడి సతీష్ కుమార్, స్టీవ్హాన్స్ వద్ద నుంచి 12 మల్టీ కలర్ ఎల్‌ఎస్డీ బ్లాట్స్ (సుమారు 0.2 గ్రాములు)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ను ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి యువతకు విక్రయిస్తున్నట్లు నిం దితుడు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. అతనితో పాటు పాండా స్టీవ్హాన్స్, హృతిక్, డెన్నిస్, మార్టిన్లను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరో నిందితుడు పరా రీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కుషాయిగూడ పోలీసులు వెల్లడించారు.