24-12-2025 02:24:22 AM
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
మేడ్చల్, డిసెంబర్ 23(విజయ క్రాంతి): అట్రాసిటీ కేసుల విచారణలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. మల్కాజ్గిరి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ శ్యాంప్రకాష్ అధ్యక్షతన సబ్ డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కొందరి ఒత్తిడిల వల్ల అట్రాసిటీ కేసుల నమోదుకు పోలీసులు వెనుక డుతున్నారని, కొందరిని తప్పించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు బిఆర్‌ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని, వాటిని వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వెంకటాపురం డివిజన్ యాదమ్మ నగర్ లోని ఎస్సీ ఎస్టీ కుటుంబాల నివాస ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ రైట్స్ డే సందర్భంగా ప్రభు త్వ అధికారులు చట్టంపై అవగాహన కల్పించినప్ప టికీ ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం విచారకరమన్నారు. ఎస్సీలకు కులద్రీ వకర పత్రాల జారీ విషయంలో తహసిల్దార్ లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసిపిలు శంకర్ రెడ్డి, చక్రపాణి, వెంకటరెడ్డి, ఎస్త్స్రలు ప్రశాం త్, రవి, సుధీర్, తహసిల్దార్ లు వాణి, రాములు, సీతారాం తదితరులు పాల్గొన్నారు.